News February 22, 2025
నేడు టీ-శాట్‌లో ‘పది’ పాఠాలు

TG: ఇవాళ టీ-శాట్ ఛానెల్‌లో పదో తరగతి పాఠాలు ప్రసారం కానున్నాయి. ఉ.9.30 గంటల నుంచి సా.5 గంటల వరకు టెలికాస్ట్ కానున్నట్లు SCERT సంచాలకుడు రమేశ్ తెలిపారు. వార్షిక పరీక్షలకు సంబంధించి మెలకువలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులు బోధించనున్నారు. విద్యార్థులు ప్రసారాలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
Similar News
News February 22, 2025
ఏపీపీఎస్సీపై అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి

AP: గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ <<15544005>>ప్రభుత్వం రాసిన లేఖపై<<>> ఏపీపీఎస్సీ ఇంకా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిన్ననే లేఖ రాసినా ఏపీపీఎస్సీ పెద్దలు ఇంకా స్పందించకపోవడంపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపే పరీక్ష ఉండటంతో అసలు జరుగుతుందా? లేదా? అని అయోమయానికి గురవుతున్నారు.
News February 22, 2025
ఇదే అసలైన యాంగ్రీ బర్డ్!

యానిమేటెడ్ చిత్రాల్లో ఉండే యాంగ్రీ బర్డ్‌ను ఓ కెమెరామెన్ గుర్తించారు. US నెబ్రాస్కాలోని ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కార్డినల్ మిడ్-ఫ్లైట్ పక్షికి సంబంధించిన ఫొటోను అద్భుతంగా తీశాడు. ఈ జీవి శరీరమంతా ఎరుపు రంగులో ఉండి సీరియస్‌గా చూస్తున్నట్లు కనిపించింది. ఫొటోలో ఈ ఎర్రటి పక్షి దూసుకొస్తున్నట్లుగా ఉంది. ఇదే అసలైన యాంగ్రీ బర్డ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News February 22, 2025
భారత్‌తో మ్యాచ్.. పాక్ జట్టుకు స్పెషల్ కోచ్

CT-2025లో భాగంగా రేపు భారత్, పాక్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ట్రోఫీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి రావడంతో స్పెషల్ కోచ్‌ను నియమించుకుంది. మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్ రేపటి మ్యాచ్ కోసం పాక్ జట్టును సన్నద్ధం చేయనున్నారు. ఇతను గతంలో కెన్యా, UAE జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. CT తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో PAK ఓడిపోయిన విషయం తెలిసిందే.