News February 22, 2025
నేడు టీ-శాట్‌లో ‘పది’ పాఠాలు

TG: ఇవాళ టీ-శాట్ ఛానెల్‌లో పదో తరగతి పాఠాలు ప్రసారం కానున్నాయి. ఉ.9.30 గంటల నుంచి సా.5 గంటల వరకు టెలికాస్ట్ కానున్నట్లు SCERT సంచాలకుడు రమేశ్ తెలిపారు. వార్షిక పరీక్షలకు సంబంధించి మెలకువలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులు బోధించనున్నారు. విద్యార్థులు ప్రసారాలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
Similar News
News March 17, 2025
కొత్త ఏడాది రాశిఫలాలు..

ఈ నెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాది పంచాంగంలో రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉన్నాయి. కన్య, మిథునం రాశుల వారికి ఆదాయం ఎక్కువ. వీరికి 14 ఆదాయం, వ్యయం 2గా ఉంది. మేషం, వృశ్చికం రాశులవారికి 2మాత్రమే ఆదాయం ఉండగా, వ్యయం మాత్రం 14గా ఉంది. మేష రాశి వారికి అత్యధికంగా అవమానం 7గా ఉంది. కర్కాటకం, కుంభం రాశులవారికి రాజపూజ్యం 7గా ఉంది. మీరూ చెక్ చేసుకోండి.
News March 17, 2025
పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.
News March 17, 2025
నియోజకవర్గానికి 4-5వేల మందికి సాయం: సీఎం రేవంత్

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని CM రేవంత్ తెలిపారు. ఒక్కొక్కరికి ₹50వేల నుంచి ₹4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. ‘రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4-5వేల మందిని ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.