News September 18, 2024

పదేళ్ల తెలంగాణ.. ధనిక రాష్ట్రాల్లో రెండో స్థానం

image

ఏర్పడి పదేళ్లే అయినా తెలంగాణ దేశంలోని ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం దక్కించుకుంది. ఇందులో సింహభాగం క్రెడిట్ హైదరాబాద్‌కు దక్కుతుంది. విభేదాలకు అతీతంగా ప్రజలందరూ సామరస్యంగా తమ పని తాము చేసుకుపోవడం, సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుత ప్రగతి, రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు ఇవన్నీ ఈ కోటి రతనాల వీణను ధనిక రాష్ట్రంగా నిలబెట్టాయి. త్వరలోనే రెండు తెలుగురాష్ట్రాలు అగ్రస్థానానికి చేరాలని కోరుకుందాం.

Similar News

News November 27, 2025

పార్టీ నిర్ణయిస్తే సీఎంగా డీకేను స్వాగతిస్తాం: పరమేశ్వర

image

కర్ణాటకలో CM మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా సీఎం ఆశావహుల్లో ఉన్నా. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా ఆ పదవికి తగిన అభ్యర్థే. కానీ ఆ పోస్టుకు హైకమాండ్ DK శివకుమార్‌ను నిర్ణయిస్తే స్వాగతిస్తాం. పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అధిష్ఠానానికి తెలుసు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, డీకే మధ్య డీల్ గురించి నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.

News November 27, 2025

రబ్బరు సాగు.. ఒక్కసారి నాటితే 40 ఏళ్ల దిగుబడి

image

కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవాలో రబ్బరు సాగు ఎక్కువ. APలోని కొన్నిప్రాంతాల్లో రైతులు రబ్బరును సాగు చేస్తున్నారు. పంట నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమై 40 ఏళ్ల పాటు దిగుబడి, ఆదాయం వస్తుంది. ఈ పంటకు ఉష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. కనీస ఉష్ణోగ్రత 25డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 34డిగ్రీల సెల్సియస్‌గా ఉంటే దిగుబడి బాగుంటుంది. ఈ మొక్క పెరగాలంటే దాదాపు రోజుకు 6గంటల సూర్యకాంతి అవసరం ఉంటుంది.

News November 27, 2025

స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

image

ఆన్‌లైన్‌ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్‌ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.