News January 16, 2025

యజమాని ఇష్టాన్ని బట్టే టెనంట్ నడుచుకోవాలి: హైకోర్టు

image

అద్దెకుండేవారు యజమాని ఇష్టాయిష్టాలను బట్టి నడుచుకోవాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. అతడు/ఆమె కోరుకుంటే ప్రాపర్టీని ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించింది. టెనంట్స్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చేముందు యజమాని అవసరాన్ని కోర్టులు నిజనిర్ధారణ చేయాలని సూచించింది. UPలో తనకు అవసరముందని యజమాని చెప్పినా ప్రాపర్టీ ఖాళీ చేయకుండా టెనంట్స్ కోర్టుకెక్కడంతో ధర్మాసనం ఇలా స్పందించింది.

Similar News

News January 16, 2025

కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

image

TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలుగా ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. అర్వింద్ కుమార్, BLN రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా KTRను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి చెప్పినట్లే తాము చేశామని ఇటీవల ఈడీ విచారణకు హాజరైన అర్వింద్, రెడ్డి చెప్పినట్లు సమాచారం.

News January 16, 2025

ఇంట్లోని ప్లాస్టిక్ వేస్ట్‌ను ఇలా చేయండి: JD

image

ఇంటి అవసరాల్లో వినియోగించే ప్లాస్టిక్ కవర్లను సులువుగా ఎలా సేకరించవచ్చో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ‘ప్రతి ఇంట్లో రోజూ నూనె, పాలు, కిరాణా సామగ్రి, షాంపూ, చిప్స్ కవర్లంటూ కనీసం 10 నుంచి 20 ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేస్తాం. వాటిని సీసాలో నింపి మూతపెట్టి డస్ట్‌బిన్‌లలో వేసేలా మీ పిల్లలను ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు సులువుగా, జంతువులు తినకుండా ఉంటాయి’ అని తెలిపారు.

News January 16, 2025

మహాకుంభమేళాలో తిరుమల శ్రీనివాసుడికి చక్రస్నానం

image

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో తిరుమల ఆలయ అర్చకులు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య గంగానదిలో చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు.