News February 4, 2025
తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు.. 144 సెక్షన్

AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా, తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Similar News
News February 15, 2026
శివ నామాలు అర్థాలు ‘‘దక్షిణామూర్తి’’

శివుడు కేవలం లయకారుడే కాదు, సకల విద్యాప్రదాత కూడా. మౌనంగా ఉంటూనే తన ముద్రల ద్వారా పరమ సత్యాన్ని బోధించే ఆదిగురువు ఈయన. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని సనకాది మునులకు జ్ఞానాన్ని ఉపదేశించారు కాబట్టి ఈయనకు ‘దక్షిణామూర్తి’ అనే పేరు వచ్చింది. మేధస్సు, జ్ఞానం, సంగీతం, యోగం వంటి కళలన్నింటికీ ఈయనే మూలపురుషుడు. విద్యార్థులు, జ్ఞానాన్వేషకులు ఈయనను ధ్యానించడం వల్ల అత్యున్నతమైన బుద్ధిని పొందుతారు.
News February 15, 2026
మొన్న డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్‌పై చైనా నిషేధం!

వాహన భద్రతా ప్రమాణాలను చైనా కఠినతరం చేసింది. ఇటీవల ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను బ్యాన్ చేయగా, తాజాగా హాఫ్ స్టీరింగ్ వీల్స్‌ను నిషేధించింది. 2027 Jan 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ప్రమాదాల్లో డ్రైవర్లకు తగిలే గాయాల్లో 46% స్టీరింగ్ వ్యవస్థ కారణమవుతోంది. హాఫ్ స్టీరింగ్ వల్ల తీవ్రత పెరుగుతోంది. యాక్సిడెంట్లలో ఫ్లష్ హ్యాండిల్స్ తెరుచుకోని ఘటనలు ఎక్కువయ్యాయి. దీంతోనే వాటిని బ్యాన్ చేసింది.
News February 15, 2026
పుతిన్ యుద్ధానికి బానిస: జెలెన్‌స్కీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి బానిస అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ దేశంలో ప్రతి పవర్ ప్లాంటును రష్యా ధ్వంసం చేసిందని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని చెప్పారు. హంగేరీ PM విక్టర్‌కు పొట్ట ఎలా పెంచుకోవాలో తెలుసని, రష్యా ట్యాంకులను ఆపడానికి సైన్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఎద్దేవా చేశారు.


