News March 19, 2024
చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరుపై ఇటీవలి జాబితాలో టీడీపీ స్పష్టతనివ్వలేదు. మాజీ ఇన్ఛార్జ్లు వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతితో పాటు తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆశావహుల్లో ఉన్నారు. దీంతో సుజాతమ్మ అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News February 6, 2026
బంగ్లా ఎన్నికలు: మ్యానిఫెస్టోల్లో ఇండియా, హిందువుల ప్రస్తావన

Feb 12న బంగ్లాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని BNP ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో హిందువుల ఆస్తులు, ప్రార్థనా స్థలాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. భారత్‌ను యజమానిలా కాకుండా మిత్రుడిలా చూస్తామని పేర్కొంది. మరోవైపు జమాత్-ఎ-ఇస్లామీ భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపినా హిందువుల రక్షణపై మాత్రం మౌనం వహించింది.
News February 6, 2026
మేం బాధపడలేదు కానీ..: పాక్ కెప్టెన్

<<17861491>>ఆసియా కప్<<>>లో భారత జట్టు తీరుతో తామేమీ బాధపడలేదని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. కానీ హ్యాండ్‌షేక్, ట్రోఫీ నిరాకరించడం వంటివి జరగకూడదని, ఆటకు మంచిది కాదని చెప్పారు. ‘T20 WCలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ICC టోర్నమెంట్లలో ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే’ అని తెలిపారు. రేపు నెదర్లాండ్స్‌తో పాక్ తొలి మ్యాచ్ ఆడనుంది. 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను <<19024958>>బాయ్‌కాట్<<>> చేస్తున్నట్లు పాక్ ప్రకటించడం తెలిసిందే.
News February 6, 2026
ఇంట్లో దేవుళ్ల విగ్రహాలు పగిలిపోతే ఏం చేయాలి?

ఇళ్లలో పూజించిన దేవతా విగ్రహాలు పగిలినా, పటాలు చిరిగినా వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాటిని పారే నీటిలో నిమజ్జనం చేయాలని చెబుతున్నారు. చిరిగిన పటాలను పవిత్ర అగ్నిలో ఆహుతి చేయడం శ్రేయస్కరమని అంటున్నారు. ఏ పద్ధతిని అనుసరించినా దైవభావంతో గౌరవప్రదంగా చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆధ్యాత్మిక విలువలను కాపాడిన వారవుతారు అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


