News March 19, 2024

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

image

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోట్ల సుజాతమ్మ అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరుపై ఇటీవలి జాబితాలో టీడీపీ స్పష్టతనివ్వలేదు. మాజీ ఇన్‌ఛార్జ్‌లు వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతితో పాటు తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆశావహుల్లో ఉన్నారు. దీంతో సుజాతమ్మ అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

Similar News

News March 17, 2026

విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

image

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

BIG ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. TGలో నేటి నుంచి 23వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, HYD, మేడ్చల్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అటు APలో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన మోస్తరు వానలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.