News December 6, 2024
కుత్బుల్లాపూర్ MLA ఇంటి వద్ద ఉద్రిక్తత

TG: కుత్బుల్లాపూర్ MLA వివేకానంద ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టగా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా అరెస్టుల నేపథ్యంలో BRS శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు.
Similar News
News January 10, 2026
నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ లేదు’ అని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు.
News January 10, 2026
భారీ స్కోరు చేసిన గుజరాత్ జెయింట్స్

WPL-2026లో యూపీ వారియర్స్‌తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 207-4 స్కోరు చేసింది. కెప్టెన్ గార్డ్నర్(65) అర్ధసెంచరీతో అదరగొట్టగా అనుష్క(44), సోఫీ డివైన్(38) సహకారం అందించారు. చివర్లో జార్జియా మెరుపులు మెరిపించి 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 27* రన్స్ చేయడంతో స్కోరు బోర్డు 200 దాటింది. యూపీ బౌలర్లలో సోఫీ 2 వికెట్లు, శిఖా పాండే, డాటిన్ తలో వికెట్ తీశారు. UP టార్గెట్ 208.
News January 10, 2026
ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ మారట్లేదు: సీఎం

AP: ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ <<18799615>>రాజధానిపై<<>> విషం చిమ్మడం మానట్లేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయరు. లండన్, ఢిల్లీ సహా అనేక పెద్ద నగరాలు నదీతీరాల పక్కనే ఉన్నాయి. నదీగర్భం, నదీపరీవాహక ప్రాంతానికి తేడా జగన్‌కు తెలియదు’ అని మీడియాతో చిట్‌చాట్‌లో విమర్శించారు.


