News December 6, 2024

కుత్బుల్లాపూర్ MLA ఇంటి వద్ద ఉద్రిక్తత

image

TG: కుత్బుల్లాపూర్ MLA వివేకానంద ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టగా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా అరెస్టుల నేపథ్యంలో BRS శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు.

Similar News

News January 23, 2025

సీనియర్ ప్లేయర్లకు చుక్కలు చూపించిన జమ్మూ పేసర్

image

ముంబైతో జరిగిన రంజీ మ్యాచులో జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ సీనియర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ(3), అజింక్య రహానే(12), శివమ్ దూబే(3), హార్దిక్ తామూర్(7)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపారు. వారు క్రీజులో ఏమాత్రం కుదురుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగారు. కాగా పుల్వామాకు చెందిన 31 ఏళ్ల ఉమర్ 2013 నుంచి క్రికెట్ ఆడుతున్నారు. గతంలో ఇండియా-సి జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.

News January 23, 2025

‘ఏమైనా సరే.. FEB 20లోపు డెలివరీ చేయండి’

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన <<15211801>>కొత్త రూల్‌<<>>తో అక్కడి ఇండోఅమెరికన్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 20లోపు జన్మించే పిల్లలకు మాత్రమే అక్కడి పౌరసత్వం లభించనుంది. దీంతో ఇప్పటికే గర్భంతో ఉన్నవారు ఫిబ్రవరి 20లోపు డెలివరీ జరిగేలా వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. నెలలు నిండకుండానే సి-సెక్షన్లు చేయాల్సిందిగా వైద్యులకు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

News January 23, 2025

పెట్టుబడులు మూడింతలు.. 46 వేల ఉద్యోగాలు!

image

దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా అమెజాన్‌తో కలుపుకొని పెట్టుబడులు మొత్తం రూ.1.32 లక్షల కోట్లు దాటాయి. వీటితో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే <<15233398>>పెట్టుబడులు దాదాపు మూడింతలు<<>> మించిపోయాయి.