News March 30, 2024
మే మొదటి వారంలో టెన్త్ ఫలితాలు!

AP: టెన్త్ జవాబు పత్రాల వాల్యుయేషన్ను ఏప్రిల్ 1 ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. 6.23 లక్షల మంది రెగ్యులర్, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారని, 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈసీ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.
Similar News
News December 13, 2025
2026 కల్లా వెలిగొండ పనులు పూర్తి: మంత్రి నిమ్మల

AP: వెలిగొండ పనుల్లో రోజువారీ లక్ష్యాలను పెంచామని, 2026 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు టన్నెల్లో 18KM లోపలి వరకు వెళ్లి పనులను పరిశీలించారు. ప్రస్తుత వర్క్తో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయడానికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. ఇన్ని పనులుండగా ప్రాజెక్టు పూర్తయిపోయిందని జగన్ జాతికి అంకితం చేయడం ఎంత విడ్డూరమో ఆలోచించాలన్నారు.
News December 13, 2025
పాల మొదటి 2 ధారలు, గోటి పరీక్ష ముఖ్యం

☛ కొన్ని గేదెల పొదుగు పెద్దగా ఉన్నా లోపల పొదుగు వాపు ఉండే ఛాన్సుంది. అందుకే నల్లటి గిన్నెలో పాలను పితికి మొదటి రెండు ధారలను పరిశీలించాలి. అందులో గడ్డలు, రక్తం లేదా నీళ్ల విరుగుడు కనిపిస్తే ఆ గేదెను కొనవద్దు.
☛ మెషిన్ లేకుండానే పాలలో వెన్నశాతం చెక్ చేయాలి. దీనికి పాలు పితికిన వెంటనే ఒక చుక్కపాలను బొటన వేలు గోరు మీద వేయాలి. ఆ చుక్క జారిపోకుండా గోరు మీదే ఉంటే అవి చిక్కటి పాలుగా గుర్తించాలి.
News December 13, 2025
దోషాలను తొలగించే ‘కూష్మాండ దీపం’

ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే అఖండ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘ఈ దీపం వెలిగించడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. చండీ హోమంతో సమానమైన ఫలితం దక్కుతుంది. ఆర్థిక, ఆరోగ్య, సంతాన సమస్యలను తొలగించుకోవడానికి ఈ పరిహారం పాటించాలి’ అని సూచిస్తున్నారు. కూష్మాండ దీపాన్ని ఎప్పుడు, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


