News April 30, 2024
కాసేపట్లో టెన్త్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: టెన్త్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. bse.telangana.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
Similar News
News April 2, 2026
IIFCLలో 33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అప్లై చేశారా?

33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL), న్యూఢిల్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. MBA/ PGDBMలో 60% మార్కులు సాధించిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం నెలకు సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి 10.04.26 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.iifcl.in చూడండి.
News April 2, 2026
యుద్ధాలు: ఇండియా ఆయుధాలకు గిరాకీ

యుద్ధాల నేపథ్యంలో పలు దేశాలు భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆయుధ కొనుగోళ్లను పెంచుకుంటున్నాయి. ఈ తరుణంలో మన డిఫెన్స్ యంత్ర పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. 2025-26లో ₹38,424CR మేర ఇండియా డిఫెన్స్ ఎగుమతులు జరిగినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇది గత ఏడాదికన్నా 62%అధికం. 2021-22లో ఈ ఎగుమతి విలువ ₹12,814 CR మాత్రమే. మొత్తం ఎగుమతుల్లో 54.84% పబ్లిక్ సెక్టార్లో, 45.16% PVT సెక్టార్లో జరిగాయి.
News April 2, 2026
నిట్కాన్ లిమిటెడ్‌లో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నిట్కాన్ లిమిటెడ్, ఢిల్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్‌లో 80, ఎలక్ట్రికల్/ మెకానికల్‌ల్లో 20 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు 3 ఏళ్ల పని అనుభవం, ఇంజినీరింగ్‌తో పాటు ఏడాది ఉద్యోగ అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు 08.04.26 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం nitcon.org చూడండి.


