News September 19, 2024

వచ్చే నెల 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు. 22 వేల మంది పరీక్షలకు హాజరు కానుండగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News November 23, 2025

HNK: దరఖాస్తులకు డిసెంబర్ 5 వరకు గడువు

image

HNK టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష 2026కు దరఖాస్తుల గడువును డిసెంబర్ 5గా నిర్ణయించినట్టు ఇన్చార్జ్ డీఈఓ ఎ. వెంకటరెడ్డి తెలిపారు. ఏడో తరగతి ఉత్తీర్ణులు లోయర్ గ్రేడ్ పరీక్షకు, లోయర్ గ్రేడ్ లేదా సమాన ఉత్తీర్ణత కలిగిన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులు. www.bse.telangana.gov.inలో ఆన్లైన్‌‌లో దరఖాస్తులు సమర్పించాలి. అనంతరం ఆధార్, స్టడీ సర్టిఫికెట్‌‌‌ను డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News November 23, 2025

పిల్లలు బరువు తగ్గుతున్నారా?

image

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.

News November 23, 2025

టెన్త్, ఐటీఐ అర్హతతో 542 పోస్టులు

image

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 542 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల పురుషులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పీఈటీ/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.50, SC, STలకు ఫీజు లేదు. దరఖాస్తు హార్డ్ కాపీ, సర్టిఫికెట్ జిరాక్స్‌లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.