News April 21, 2025

పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్

image

AP: పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఈ నెల 23న (బుధవారం) ఉ.10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది. ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి యాడ్స్ ఉండవు.

Similar News

News April 6, 2026

TODAY HEADLINES

image

*ఎన్నికల్లో గెలిచాక టీఎంసీ పాపాల లెక్క తేలుస్తాం: మోదీ
*నీటి సంరక్షణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్: CBN
*కోర్టు అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర స్థలం: సీఎం రేవంత్
*అసలు సినిమా ముందుంది: రాఘవ్ చడ్ఢా
*హార్ముజ్‌ను దాటిన 9వ భారత నౌక
*డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తా: ట్రంప్
*IPL: SRHపై LSG, చెన్నైపై బెంగళూరు గెలుపు

News April 6, 2026

ఫైటర్ జెట్ కూలిపోయింది కానీ పైలట్లు సేఫ్: US

image

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమ <<19559906>>F-15E<<>> ఫైటర్ జెట్ కూలిపోయిందని అమెరికా ధ్రువీకరించింది. అందులోని ఇద్దరు పైలట్లు ఇరాన్ భూభాగంలో పడిపోగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి విజయవంతంగా వారిని రక్షించామని తెలిపింది. ఇరాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా పైలట్లను రక్షించే క్రమంలో అమెరికా పలు ఎయిర్ క్రాఫ్ట్‌లను కోల్పోయింది.

News April 6, 2026

డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తా: ట్రంప్

image

ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 48 గంటల డెడ్‌లైన్‌ను 82 గంటలకు పొడిగించినట్లు తెలిపారు. మంగళవారం 8 గంటల్లోపు(అమెరికా కాలమానం ప్రకారం) డీల్ చేసుకోవాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తానని హెచ్చరించారు. దేశంలో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు అంటూ ఏవీ మిగలవని స్పష్టంచేశారు.