News December 11, 2024
మార్చి 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్!
AP: వచ్చే ఏడాది మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. దీనికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి లభించగానే పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 1 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News January 21, 2025
నేడు KRMB కీలక సమావేశం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) నేడు హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం కానుంది. ఇప్పటికే 2సార్లు వాయిదా పడిన ఈ భేటీ ఉ.11గంటలకు జరగనుంది. నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, తనిఖీలు, పర్యవేక్షణ తమ పరిధిలోనే ఉండాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అటు సాగర్, శ్రీశైలంలోని కాంపొనెంట్లను కృష్ణాబోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ CRPFకు ఇవ్వాలని AP కోరుతోంది. ఈ అంశాలే అజెండాగా భేటీ జరగనుంది.
News January 21, 2025
ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు
AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.
News January 21, 2025
6.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు
AP: తిరుమలలో పది రోజుల పాటు శ్రీవారిని 6,83,304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా రూ.34.43కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియగా, సోమవారం తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలను టీటీడీ ప్రారంభించింది.