News March 16, 2025

GOOD NEWS: వారికి ఉచితంగా బస్సు

image

AP: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్‌తో వచ్చే నెల 1వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.

Similar News

News February 14, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* పూరీలు తెల్లగా ఉండాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* ఆలూతో కలిపి నిల్వచేస్తే వెల్లుల్లి తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోవు.

News February 14, 2026

పాయిజన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోబోయి..!

image

నలుగురు బాలికలు చేసిన వింత ప్రయోగం వారి ప్రాణాలను బలితీసుకుంది. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు సరదాగా పొలానికి వెళ్లి పక్షులను చంపే విషాన్ని నీళ్లలో కలుపుకొని తాగారు. నలుగురు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోగా ఒక బాలిక వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించారనే బాధతో వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

News February 14, 2026

ఆ బౌలర్‌తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

image

రేపు పాక్‌తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని టీమ్‌ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్‌ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.