News November 23, 2024

టెన్త్ అర్హత.. 8 నుంచి ‘అగ్నివీర్’ ర్యాలీ

image

TG: తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు టెన్త్ పాసై, 17-21 ఏళ్ల వయసు ఉండాలని సూచించారు. సందేహాలు ఉంటే 040-27740059కు కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2024

మోస్ట్ డిజాస్టర్ మూవీగా ‘కంగువ’!

image

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘కంగువ’ థియేట్రికల్ రన్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.130 కోట్ల నష్టంతో ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచినట్లు వెల్లడించాయి. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. ఈ మూవీ రూ.120 కోట్లు నష్టపోయింది. కాగా మరికొన్ని రోజుల్లో ‘కంగువ’ OTTలోకి రానుంది.

News December 2, 2024

ఉద్యోగుల అంత్యక్రియల ఛార్జీలు పెంపు

image

TG: ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఖర్చును రూ.20 వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

News December 2, 2024

విండ్ ఫాల్ టాక్స్ రద్దు చేసిన కేంద్రం

image

ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రిలయన్స్, ONGC వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. దేశీయ సంస్థలు ముడి చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఈ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు ఆ సంస్థలు ఆయా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తుంటాయి.