News June 21, 2024
పాక్ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు రద్దు?

కొందరు పాకిస్థాన్ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన చేసినందుకు వారికి డిమోషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పాత పద్ధతిలోనే సెలక్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టాక్. కెప్టెన్, హెడ్ కోచ్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకుండా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 9, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్కు ఇది ఉపయోగపడనుంది.
News December 9, 2025
అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) <<18513734>>వ్యవహారంపై<<>> సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. SIR కొనసాగుతుందని స్పష్టం చేసింది. BLOలపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, బెదిరింపులను తమ దృష్టికి తేవాలని ECని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పింది.
News December 9, 2025
ఈ టైమ్లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it


