News June 21, 2024
పాక్ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు రద్దు?
కొందరు పాకిస్థాన్ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన చేసినందుకు వారికి డిమోషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పాత పద్ధతిలోనే సెలక్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టాక్. కెప్టెన్, హెడ్ కోచ్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకుండా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 11, 2024
వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్: ఏది బెటర్?
చాలామంది వైట్ ఎగ్ కన్నా బ్రౌన్ ఎగ్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. ధర ఎక్కువైనా వాటినే కొంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. పెంకు రంగులోనే తేడా ఉంటుందని, రెండు గుడ్లలోనూ సమాన పోషకాలు ఉంటాయన్నారు. పెంకు రంగు మారటం వల్ల రుచి, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. బ్రౌన్ ఎగ్ పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. వాటిని పెంచేందుకు ఖర్చు ఎక్కువ కావటంతో ఆ గుడ్లను అధిక ధరకు విక్రయిస్తారు.
News September 11, 2024
వారికి రూ.25,000 సాయం!
AP: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ.10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు, బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
News September 11, 2024
నేడు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాల రాక
తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బృందాలు APకి రానున్నాయి. ఇవాళ కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం TGలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.