News June 28, 2024
ఘోరం.. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయింది
మహిళలు ఒళ్లు నొప్పుల గురించి క్వాక్ డాక్టర్ (అన్‌సర్టిఫైడ్) వద్దకు వెళ్తే వారికి త్వరగా ఉపశమనం కలిగించేందుకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు చేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 32 ఏళ్ల మహిళకు వేసిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల ఆమె చేతిని కోల్పోయారు. లక్నో KGMU చీఫ్ సర్జన్ సయ్యద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తేలికపాటి నొప్పికే ఇంట్రాఆర్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందన్నారు.
Similar News
News December 12, 2024
బౌన్సర్లు ఎవరిపైనైనా దాడులు చేయొచ్చా?
ప్రస్తుతం బౌన్సర్ల వినియోగం పెరిగిపోతోంది. హోటళ్లు, పబ్బులు, మాల్స్, ఈవెంట్లలో జనాన్ని అదుపు చేసేందుకు వీరిని ఉపయోగిస్తుంటారు. కొందరు బౌన్సర్లు భద్రత పేరుతో అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. పస్రా చట్టం ప్రకారం ఇతరులపై దాడులు చేయడానికి వీరికి హక్కు లేదు. వారు దాడి చేస్తే కేసు పెట్టొచ్చు. బౌన్సర్లకు కచ్చితంగా PSLN నంబర్, కోడ్ ఉండాలి. బౌన్సర్ల వ్యవస్థ ఉండాలా వద్దా అనేదానిపై మీ కామెంట్.
News December 12, 2024
రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: KTR
TG: అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని CM రేవంత్‌ని KTR ప్రశ్నించారు. ‘మీ మాటలు అబద్ధం, మీ చేతలు అబద్ధం. కాకిలెక్కలతో మోసగించడమే మీ విధానమా? రూ.50-65వేల కోట్ల వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరికోసం? ఢిల్లీకి మూటలు మోసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగీ, లాగు వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?’ అని ఫైర్ అయ్యారు.
News December 12, 2024
వారిపై చట్టపరమైన చర్యలు: సాయిపల్లవి
తనపై వస్తోన్న రూమర్స్‌పై హీరోయిన్ సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ట్వీట్ చేశారు. కాగా ‘రామాయణ’లో సీత పాత్ర చేసేందుకు సాయిపల్లవి తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారంటూ ఓ తమిళ వెబ్‌సైట్ కథనాలు ప్రచురించింది. దానిపై ఆమె ఈ విధంగా స్పందించారు.