News April 24, 2024
ఘోరం.. టెన్త్‌లో స్టేట్ టాపర్ ముఖంపై ట్రోల్స్

సోషల్ మీడియాలో పలువురు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. UP టెన్త్ ఫలితాల్లో 98.50% మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్ అనే బాలిక ముఖంపై కొందరు ట్రోల్స్ చేశారు. ఆమెకు అవాంఛిత రోమాలు ఉండటంపై ఎగతాళిగా పోస్టులు పెట్టారు. ఆ చదువుల తల్లిని ప్రశంసించాల్సింది పోయి పాశవిక మీమ్స్‌తో శునకానందం పొందారు. ఇది చాలా దారుణమని, ట్రోలర్స్‌ను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News February 21, 2026
T20WC.. సూపర్-8లో మ్యాచ్ రద్దయితే?

T20WC సూపర్-8లో ప్రతి జట్టు 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఏదైనా కారణాలతో మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే లేదు. అందువల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. లేదా ఇతర గేమ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా ఇవాళ జరగాల్సిన న్యూజిలాండ్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ ప్రారంభమవలేదు. గ్రూప్-1లో IND, SA, WI, ZIM, గ్రూప్-2లో ENG, NZ, PAK, SL ఉన్నాయి.
News February 21, 2026
రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. 23-24వ తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, WGL, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News February 21, 2026
వేడెక్కిన కశ్మీర్.. ALL TIME RECORD

ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీర్ ఇవాళ వేడెక్కెంది. ఏకంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ప్రాంతంలో FEBలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. సాధారణం కంటే 11 డిగ్రీలు అధికంగా రికార్డయింది. అక్కడ 1940, 2016లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలను తాకింది. అలాగే ఈ నెలలో మంచుతో కప్పబడే గుల్మార్గ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు కాగా ఇవాళ 11.5 డిగ్రీలకు చేరింది. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


