News April 23, 2025
ఉగ్రదాడి.. జనసేన ఆధ్వర్యంలో 3 రోజులు సంతాపదినాలు

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాను ఇవాళ అవతనం చేయాలన్నారు. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు.
Similar News
News April 23, 2025
అద్భుతమైన క్యాచ్‌లు కాదు.. క్యాచ్ పడితే అద్భుతం!

IPL: ఫీల్డింగ్‌లో ఈ ఏడాది అన్ని జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 40 మ్యాచులు జరగ్గా, అన్ని జట్లు కలిపి 111 క్యాచ్‌లు వదిలేశాయి. 247 మిస్‌ఫీల్డ్స్, 172 రనౌట్స్ మిస్ చేశాయి. 2020 నుంచి తొలి 40 మ్యాచ్‌లతో పోలిస్తే ఇదే చెత్త ప్రదర్శన. MI జట్టు ఒక్కటే 83.6% క్యాచింగ్ పర్సంటేజ్‌తో కాస్త మెరుగ్గా ఉంది. గతంలో అద్భుతమైన క్యాచ్‌లు చూసిన ఫ్యాన్స్ ప్రస్తుతం పట్టిన ప్రతి క్యాచ్‌నూ అద్భుతం అంటున్నారు.
News April 23, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు మే 6 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే.
News April 23, 2025
ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్‌లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.