News June 12, 2024
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు.. జవాన్ మృతి

జమ్మూకశ్మీర్‌లోని రియాసి ఘటన మరువక ముందే మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కతువా జిల్లాలోని సార్తాల్ ప్రాంతంలోని పోలీస్ చెక్ పాయింట్ వద్ద ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా సైనిక బలగాల ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. మరోవైపు దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. 72 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి.
Similar News
News September 12, 2025
నేడు వైస్ ప్రెసిడెంట్‌గా రాధాకృష్ణన్ ప్రమాణం

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, NDA కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
SBIలో 122 ఉద్యోగాలు

SBI 122 పోస్టుల భర్తీకి <