News December 25, 2024
టెస్టు ర్యాంకింగ్స్: తొలి స్థానంలో బుమ్రా

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ బౌలర్ బుమ్రా తొలి స్థానానికి ఎగబాకారు. 904 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. దీంతో అశ్విన్ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేశారు. టాప్-10లో భారత్ నుంచి అశ్విన్(5), జడేజా(10) ఉన్నారు. ఇక టెస్టు బ్యాటర్లలో రూట్ తొలి స్థానంలో ఉండగా భారత్ నుంచి జైస్వాల్(5) మాత్రమే టాప్-10లో ఉన్నారు. జట్ల పరంగా ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


