News April 5, 2024
TET: మరో 5 రోజులే ఛాన్స్

TG: టెట్ దరఖాస్తుల గడువు ఈనెల 10తో ముగియనుంది. గత నెల 27న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 85,512 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం నాటికి పేపర్-1కు 34,174, పేపర్-2కు 51,238 మంది అప్లై చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులకు మరో 5 రోజులు అవకాశం ఉండగా, మళ్లీ గడువు పొడిగించకపోవచ్చని సమాచారం.
Similar News
News April 23, 2025
FY26లో 2-4% పెరగనున్న సిమెంట్ ధరలు!

దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5-7.5% పెరగొచ్చని CRISIL అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపింది. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో సిమెంట్ డిమాండ్ అధికమవుతుందని వెల్లడించింది. మొత్తం డిమాండ్లో 12 రాష్ట్రాల వాటా 63-65 శాతం ఉండొచ్చని వివరించింది. దీనివల్ల సిమెంట్ ధరలు 2-4% పెరగొచ్చని పేర్కొంది.
News April 23, 2025
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకెక్కనున్న మాజీ కోచ్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసెన్ గిలెస్పీ పాకిస్థాన్ జట్టుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కోచ్గా పనిచేశారు. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని పాకిస్థాన్ బకాయి పెట్టిందని ఆయన తాజాగా ఆరోపించారు. దానిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కాంట్రాక్టును ఉల్లంఘించి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారని, తామేమీ బకాయిపడలేదని పీసీబీ తెలిపింది.
News April 23, 2025
ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

AP: జమ్మూకశ్మీర్ పహల్గామ్లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.