News April 5, 2024

TET: మరో 5 రోజులే ఛాన్స్

image

TG: టెట్ దరఖాస్తుల గడువు ఈనెల 10తో ముగియనుంది. గత నెల 27న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 85,512 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం నాటికి పేపర్-1కు 34,174, పేపర్-2కు 51,238 మంది అప్లై చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులకు మరో 5 రోజులు అవకాశం ఉండగా, మళ్లీ గడువు పొడిగించకపోవచ్చని సమాచారం.

Similar News

News January 19, 2025

కొత్త రేషన్ కార్డులు వీరికే..

image

TG: కొత్త రేషన్ కార్డులకు 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. గ్రామాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.50 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో తరి(మాగాణి) పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువగా మెట్ట (కుష్కి) ఉన్న రైతులు అర్హులు. కొత్త కార్డుల కోసం JAN 21-24 వరకు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News January 19, 2025

నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా..

image

AP: గతేడాది తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో నెయ్యిని సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు ప్రకటించారు. తాజాగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) రూ.70 లక్షల విలువైన రెండు పరికరాలను విరాళమిచ్చింది. జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబులో అమర్చారు. వీటితో నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించవచ్చు.

News January 19, 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేయబోదని తేల్చిచెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లతో రైతుకు ఉరితాడు వేయాలని చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. అటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 9 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి స్పష్టం చేశారు.