News January 1, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు రేపటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి ఉ.11.30 వరకు మొదటి సెషన్, మ.2-సా.4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.
Similar News
News January 4, 2025
‘గేమ్ ఛేంజర్’ తర్వాత శంకర్ పాన్ వరల్డ్ మూవీ?
వరస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టైతే ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టును తీసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘వీరయుగ నాయగన్ వేల్పరి’ అనే పుస్తకం ఆధారంగా 3 భాగాల సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గేమ్ ఛేంజర్ రిజల్ట్పైనే ఆ ప్రాజెక్ట్ ఆధారపడినట్లు సమాచారం.
News January 4, 2025
మాల్దీవుల ప్రగతికి అండగా ఉంటాం: జైశంకర్
మాల్దీవుల ప్రగతికి, సుస్థిరతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఆయన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని జైశంకర్ పేర్కొన్నారు. అటు.. భారత్తో బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు ఖలీల్ ట్వీట్ చేశారు.
News January 4, 2025
వినియోగదారులకు EPFO గుడ్ న్యూస్
పింఛనుదారులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకునుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 68 లక్షలమంది లబ్ధిదారులు ఈ చర్యతో మేలు పొందుతారని పేర్కొంది. ఇప్పటి వరకూ EPFO కేవలం కొన్ని బ్యాంకులతోనే అగ్రిమెంట్ ఉన్న కారణంగా పింఛనుదారులు ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ భారం తప్పనుంది. ఈ నెల 1 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.