News January 1, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు రేపటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి ఉ.11.30 వరకు మొదటి సెషన్, మ.2-సా.4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.
Similar News
News January 17, 2025
రెచ్చిపోయిన దొంగలు.. కర్ణాటకలో మరో భారీ చోరీ
కర్ణాటకలో మరో భారీ చోరీ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌లో బ్యాంకులోకి చొరబడిన దొంగల ముఠా నగదు, బంగారం ఎత్తుకెళ్లింది. కారులో వచ్చి బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నిన్న బీదర్‌లోనూ దొంగల ముఠా ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే వాహనం సిబ్బందిపై <<15169507>>కాల్పులు<<>> జరిపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మరణించారు.
News January 17, 2025
‘వీరమల్లు’ లాంటి కథలు అరుదుగా వస్తాయి: బాబీ డియోల్
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమని బాబీ డియోల్ తెలిపారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చరిత్రలో జరిగిన కథలు ఎమోషనల్‌గానే కాకుండా మాస్‌గానూ ఉంటాయని ఈ స్టోరీ విన్నప్పుడే అర్థమైందన్నారు. ఇలాంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇవాళ మూవీ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది.
News January 17, 2025
ఫొటోలతో అనుబంధాన్ని వ్యక్తపరిచారు!
సంసార జీవితం పదికాలాల పాటు సాగాలంటే ఆ జంట మధ్య అన్యోన్యత పరిఢవిల్లాలి అని చెబుతుంటారు. అయితే, ఆ అన్యోన్యత ఎలా చూపించాలనే దానికి ఓ జంట కొత్త అర్థాన్ని చూపింది. 12 ఏళ్ల క్రితం కలిసిన ఈ జంట ఏటా ఓ ఫొటో దిగుతూ వారి మధ్య ఉన్న అన్యోన్యతను చూపుతూ వచ్చింది. వీరిద్దరికీ ఓ పాప జన్మించగా ఆమెతోనూ ఫొటోకు పోజులిస్తూ వచ్చారు. ఇలా ఒక్క మాట మాట్లాడకుండా వారి మధ్య ఉన్న బంధాన్ని వ్యక్తపరిచారు.