News November 3, 2024

రేపు టెట్ ఫలితాలు విడుదల

image

AP: టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ రేపు విడుదల చేయనున్నారు. గత నెల 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని కూడా విద్యాశాఖ విడుదల చేసింది. కాగా త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.

Similar News

News December 11, 2024

మోదీని కలిసిన రాజ్ కపూర్ ఫ్యామిలీ

image

దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో ఢిల్లీలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మయ్యారు. సైఫ్ అలీఖాన్‌, క‌రీనా క‌పూర్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ త‌దిత‌రులు మోదీని క‌లిశారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న RK Film Festivalలో పాల్గొనాల్సిందిగా వారు మోదీని ఆహ్వానించారు. 13 నుంచి 15 వ‌ర‌కు 3 రోజుల‌పాటు 40 న‌గ‌రాల్లో 10 రాజ్‌ కపూర్ చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

News December 11, 2024

మనోజ్ మీడియా సమావేశం వాయిదా

image

TG: రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీని కలిసిన నటుడు మంచు మనోజ్ తిరిగి జల్‌పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. తాను ఎవరితో గొడవపెట్టుకోనని సీపీకి హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మీడియా సమావేశం వాయిదా వేశారు.

News December 11, 2024

Stock Market: ఈ రోజు కూడా ఫ్లాట్‌గానే

image

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం కూడా ఫ్లాట్‌గా ముగిశాయి. సెంటిమెంట్‌ను బ‌లప‌రిచే న్యూస్ లేక‌పోవ‌డం, గ‌త సెష‌న్‌లో అమెరికా సూచీలు Dow Jones, Nasdaq, S&P500 న‌ష్ట‌పోవ‌డంతో దేశీయ సూచీలు స్త‌బ్దుగా క‌దిలాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 81,526 వ‌ద్ద‌, Nifty 31 పాయింట్లు పెరిగి 24,641 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. FMCG, IT, ఆటో రంగ షేర్లు రాణించాయి. Trent, Baja Finance, Britannia టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.