News August 10, 2024
TG: డెంగ్యూ కేసుల వివరాలు
గత 8 నెలల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 3,200 డెంగ్యూ కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ వర్షాకాలంలోనే భారీగా కేసులు నమోదయ్యాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 345 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఇటీవల కేసులు పెరుగుతుండడంతో నగరంలో వాటర్ బాడీస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది ఫాగింగ్ చేస్తున్నారు.
Similar News
News September 14, 2024
వంట నూనె ధరలు పెరగనున్నాయా?
కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. దీంతో సన్‌ఫ్లవర్, సోయా బీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై ఇంపోర్ట్ టాక్స్ 12.5% నుంచి 32.5%కి చేరింది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇంపోర్ట్ టాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News September 14, 2024
నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు
TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.
News September 14, 2024
మా నాన్న పులిని చంపి, ఆ రక్తం నా ముఖంపై పూశారు: యోగ్‌రాజ్
తన వద్ద కోచింగ్‌లో చేరాలంటే చావుపై భయం వదిలేయాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘మా నాన్న నన్ను చావు భయం లేకుండా పెంచారు. పులి వేటకు నన్ను తీసుకెళ్లారు. పులిని చంపి నన్ను దానిపై కూర్చోబెట్టారు. దాని రక్తం నా ముఖానికి పూశారు. పులికూన గడ్డి తినదని ఆయన అన్న మాట నేనెప్పటికీ మర్చిపోలేను. అందుకే నా కొడుకును కూడా భయంలేనివాడిలా పెంచాను’ అని పేర్కొన్నారు.