News February 20, 2025
నేడు టీజీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్

TG EAPCET-2025 నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. స్థానికేతర కేటగిరీ ప్రవేశాలపై సర్కారు నుంచి స్పష్టత లేకపోవడంతో కొన్ని షరతులకు లోబడి అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక BSC ఫారెస్ట్రీ కోర్సులకు గత ఏడాది వరకూ ఎప్‌సెట్‌నే ఆధారంగా చేసుకోగా అటవీశాఖ ఈ ఏడాది స్వయంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలనుకుంది. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆ కోర్సు ఎంచుకున్న వారిలో అయోమయం నెలకొంది.
Similar News
News March 25, 2025
అశుతోశ్‌ను అలా ఎలా వదిలేశారో!

అశుతోశ్ గత ఏడాది పంజాబ్‌కు ఫినిషర్‌గా గేమ్స్ గెలిపించాడు. అతడి IPL స్ట్రైక్ రేట్ 167.26 కాగా సగటు 27. లీగ్‌లో భారత ఫినిషర్ దొరకడమే అరుదు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వేలంలో కేవలం ₹3.80 కోట్లకే దక్కించుకుంటుంటే ఇతర జట్లు చోద్యం చూశాయి. నిన్న 7 రన్స్‌కే 3వికెట్లు కోల్పోయిన DCని అశుతోశ్ ఒంటిచేత్తో ఒడ్డుకు చేర్చాడు. ముందు సీజన్లో ఆల్రెడీ తనను తాను నిరూపించుకున్న అతడిపై జట్లు ఎందుకు ఆసక్తి చూపలేదో మరి!
News March 25, 2025
రూ.లక్షలు ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు: పూజా హెగ్డే

కొంతమంది రూ.లక్షలు ఖర్చుపెట్టి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారని హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ‘నాపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను కాంటాక్ట్ చేయమని మా టీమ్‌కు చెప్పాను. ఈ పని చేసేందుకు తమకు రూ. లక్షలు ఇస్తున్నారని మా టీమ్‌తో మీమర్స్ చెప్పారు. ట్రోలింగ్ ఆపాలంటే నేను కూడా అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు’ అని పేర్కొన్నారు. తెలుగులో ఆమె చివరిగా ఎఫ్-3లో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.
News March 25, 2025
కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్

ఉగాది సందర్భంగా రిలీజయ్యే కొత్త సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నార్నె నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’, నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలపై రూ.75 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పెరిగిన ధరలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయంది. TGలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.