News January 4, 2025
HMPV వైరస్‌పై TG ప్రభుత్వం కీలక ప్రకటన
చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంది. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ఇది సాధారణ జలుబు & ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపింది. జలుబు ఉన్నవారు మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నీరు పుష్కలంగా తాగుతూ పౌష్టికాహారం తినాలి. ఎక్కువగా నిద్రపోవాలి. షేక్ హ్యాండ్స్ వద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు’ అని తెలిపింది.
Similar News
News January 6, 2025
అందరూ పరిశుభ్రత పాటించాలి: ICMR
hMPV వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందవద్దని ICMR తెలిపింది. సాధారణ వైరస్ల మాదిరిగానే దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది. జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. చిన్నారులు, వృద్ధుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. సీజనల్ శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని ఆస్పత్రులు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసింది.
News January 6, 2025
ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్: మంత్రి సత్యకుమార్
AP: దేశంలో hMPV కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ICMR అడ్వైజరీ మాత్రమే ఇచ్చిందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
News January 6, 2025
4 ప్రధాన నగరాల్లో hMPV కేసులు
hMPV కేసులు మన దేశంలో కూడా వెలుగుచూస్తుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కత్తా, చెన్నైలో కేసులు నమోదయ్యాయి. ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేకపోయినా పాజిటివ్ నిర్ధారణ అవుతుండడంతో లక్షణాలు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.