News April 12, 2025
ఈ నెల 25/27న TG ఇంటర్ ఫలితాలు

ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడించడంతో తెలంగాణలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27న రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం పూర్తిచేసి ఆన్లైన్లో మార్కులు ఫీడ్ చేశారు. ఈ నెల 20 నాటికి రీవెరిఫికేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
Similar News
News December 1, 2025
ADB: గొంతు ఎత్తాలి.. నిధులు తేవాలి

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలైనా గోడం నగేశ్ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాసర ఆలయ అభివృద్ధి, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, సిర్పూర్, మంచిర్యాల రైల్వే లైన్లో కొత్త రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్లో అభివృద్ధిపై చర్చించాలి. పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరాలి.
News December 1, 2025
కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్కోట్లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్కోట్లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/


