News April 12, 2025

ఈ నెల 25/27న TG ఇంటర్ ఫలితాలు

image

ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడించడంతో తెలంగాణలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27న రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం పూర్తిచేసి ఆన్‌లైన్‌లో మార్కులు ఫీడ్ చేశారు. ఈ నెల 20 నాటికి రీవెరిఫికేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Similar News

News April 17, 2025

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రి 7 గంటల లోపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అటు మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వాన పడుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. కాగా ఆదిలాబాద్‌ జిల్లాలో సాయంత్రం వడగళ్ల వాన కురిసింది.

News April 17, 2025

గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

image

TG: గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకూ గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది.

News April 17, 2025

మంత్రి వివాదాస్పద కామెంట్స్.. FIR ఫైల్ చేయాలని కోర్టు ఆదేశం

image

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన TN మంత్రి కె.పొన్ముడిపై ఈనెల 23లోపు FIR నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. లేదంటే తామే ఈ కేసును సమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఓ సెక్స్ వర్కర్ తమ వద్దకు వచ్చిన వారిని శైవులా, వైష్ణవులా అని అడిగిందంటూ ఆయన అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించింది.

error: Content is protected !!