News January 10, 2025
TG: స్కిల్స్ యూనివర్సిటీలో మరో 3 కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

☛ ఎండోస్కోపీ టెక్నీషియన్: 6 నెలల శిక్షణ. ఇంటర్ BiPCలో 50% మార్కులు, 25 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఫీజు ₹10వేలు
☛ టీ వర్క్స్ ప్రోటో టైపింగ్ స్పెషలిస్ట్: 2 నెలల కోర్సు. టెన్త్ పాసై, 18-25 ఏళ్ల వయసుండాలి. ఫీజు ₹3వేలు
☛ మెడికల్ కోడింగ్& స్టాఫ్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ (55 డేస్): BSC(లైఫ్ సైన్సెస్) పాసవ్వాలి. వయసు 18-25. ఫీజు ₹18వేలు
☛ వెబ్సైట్: https://yisu.in/
Similar News
News December 10, 2025
ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.
News December 10, 2025
అఖండ-2 టికెట్ రేట్లు భారీగా పెంపు

అఖండ-2 సినిమా టికెట్ల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా రేపు రా.8 గంటల ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున టికెట్ రేట్ పెంచుకోవచ్చని పేర్కొంది. కాగా అఖండ-2 టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం <<18519580>>ఇప్పటికే<<>> అనుమతి ఇచ్చింది.
News December 10, 2025
గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల వైరస్ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.


