News November 28, 2024
మూడేళ్లలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా TG: న్యాబ్
TG: వచ్చే మూడేళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇందుకోసం త్వరలో 2 లక్షల మంది ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’ను తయారు చేస్తామన్నారు. డ్రగ్స్ నివారణపై పలు వర్సిటీలు, కాలేజీల సిబ్బందికి అవగాహన కల్పించారు. మార్కెట్‌లోకి రోజుకో కొత్త రకం డ్రగ్ వస్తోందని, నిటాజిన్ అనే డ్రగ్ ఒక్క గ్రాము 40 కిలోల ఓపీఎంతో సమానమని పేర్కొన్నారు.
Similar News
News December 7, 2024
మ్యూజిక్ నుంచి రెహమాన్ బ్రేక్? కూతురు ఏమన్నారంటే?
ఏఆర్ రెహమాన్ ఏడాదిపాటు మ్యూజిక్ వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కూతురు ఖతీజా ఖండించారు. ఇలాంటి పనికిరాని రూమర్స్‌ను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ఇటీవల రెహమాన్, తన భార్య సైరా భాను విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు.
News December 7, 2024
అల్పపీడనం.. రేపు వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
News December 7, 2024
రైతులు సన్నాలనే పండించాలి.. సీఎం పిలుపు
TG: తెలంగాణ రైతులు సన్న వడ్లనే పండించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సన్నవడ్లు పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు, మధ్యాహ్నభోజనంలో పేద పిల్లలకు రైతులు పండించిన సన్నబియ్యాన్నే పెడతామని పేర్కొన్నారు. ఎవరు అడ్డువచ్చినా సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.