News December 10, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘తంగలాన్’

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. పా.రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.
Similar News
News January 12, 2026
RVNLలో ఇంజినీర్ పోస్టులు

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(<
News January 12, 2026
ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
News January 12, 2026
సివిల్ సూట్ వేసినా.. స్టాప్ ఆర్డర్ వస్తేనే ఊరట

‘నల్లమలసాగర్’పై TG పిటిషన్‌ను కాదని సివిల్ సూట్ వేయాలని SC సూచించింది. అయితే సివిల్ సూట్ వేస్తే AP సహా గోదావరి బేసిన్‌లోని ఇతర రాష్ట్రాలూ స్పందించాలి. వాటి స్పందనకు ఎంత టైం పడుతుందో తెలియదు. అటు గోదావరి నీటి తరలింపునకు ఫీజిబిలిటీ నివేదికను కేంద్రానికి అందించి DPR టెండర్లకు AP సిద్ధమైంది. ఈ తరుణంలో సివిల్ దావా వేసినా SC స్టాప్ ఆర్డర్ ఇస్తేనే TGకి ఊరట. వరదజలాలే వాడుతున్నట్లు AP వాదిస్తోంది.


