News September 17, 2024
థాంక్యూ పవన్ అన్న: మంత్రి లోకేశ్
AP: విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని మంత్రి లోకేశ్‌ను ప్రశంసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన <<14117846>>ట్వీట్<<>>పై నారా లోకేశ్ స్పందించారు. ‘థాంక్యూ పవన్ కళ్యాణ్ అన్న’ అంటూ Xలో రిప్లై ఇచ్చారు. ఇటు మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకల్ని తిరుమలలో జరిగినట్లు జగన్ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. శ్రీవారితో పెట్టుకుంటే ఒక్క సీటు లేకుండా పోతారని హెచ్చరించారు.
Similar News
News October 9, 2024
ఉమెన్స్ WC: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: షఫాలీ, మంధాన, జెమిమా, హర్మన్(C), రిచా, దీప్తి, సాజన, అరుంధతి, శ్రేయాంక, శోభన, రేణుక.
SL: విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిష, నీలాక్షి, అనుష్క, కాంచన, సుగంధిక, ఇనోషి, ఉదేషికా, ఇనోక.
News October 9, 2024
రతన్ టాటా ఆరోగ్యం విషమం?
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. తన ఆరోగ్యం బాగుందంటూ టాటా 2 రోజుల క్రితమే స్పష్టతనిచ్చారు. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అవే వార్తలు రావడం గమనార్హం.
News October 9, 2024
BREAKING: నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్
AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ కంపెనీ రాబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీని ద్వారా 10వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. దేశంలో వ్యాపారం చేసేందుకు ఏపీని నంబర్-1గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. కాగా నిన్న బిగ్ <<14307324>>అనౌన్స్‌మెంట్<<>> ఉండబోతున్నట్లు లోకేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.