News December 13, 2024

మీ మద్దతుకు థాంక్స్ సర్: ప్రధాని ట్వీట్‌పై గుకేశ్

image

గుకేశ్ విజయం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అసమాన ప్రతిభ, కృషి, సంకల్పంతోనే విజయం సాధ్యమైందని గురువారం అభినందించారు. దీనిపై వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ స్పందించారు. ‘మీరు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహకానికి ధన్యవాదాలు సర్’ అని రీట్వీట్ చేశారు. అటు, తమిళనాడుకు చెందిన గుకేశ్ తనకు శుభాకాంక్షలు తెలిపిన ఆ రాష్ట్ర CM స్టాలిన్‌, డిప్యూటీ CM ఉదయనిధి స్టాలిన్‌కు సైతం ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 22, 2025

అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే ఫిఫ్టీ

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆయన అర్ధ శతకం చేశారు. ఆదిల్ రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 93/2గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి ఇంకా 40 పరుగులు కావాల్సి ఉంది.

News January 22, 2025

మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్‌ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.

News January 22, 2025

భారత్ పిచ్‌పై తేలిపోయిన RCB బ్యాటర్లు!

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.