News September 4, 2024
మోదీ, అమిత్ షాకు థాంక్యూ: చంద్రబాబు

AP: వరదలపై నష్టాన్ని అంచనా వేయడానికి రేపు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తున్నందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న బృందాలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. వరద బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందించేందుకు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Similar News
News November 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.

ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.