News September 4, 2024
మోదీ, అమిత్ షాకు థాంక్యూ: చంద్రబాబు
AP: వరదలపై నష్టాన్ని అంచనా వేయడానికి రేపు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తున్నందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న బృందాలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. వరద బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందించేందుకు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2024
ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలోని ‘ఆయుధ పూజ’ సాంగ్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 11.07గంటలకు సాంగ్ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఫొటోను పంచుకున్నారు. ఈనెల 27న ‘దేవర’ రిలీజ్ కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
News September 18, 2024
క్యాబినెట్ భేటీ ప్రారంభం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
News September 18, 2024
నటి CID శకుంతల కన్నుమూత
దక్షిణాది నటి CID శకుంతల(84) కన్నుమూశారు. బెంగళూరులో ఛాతి నొప్పితో నిన్న తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించారు. MGR, శివాజీ వంటి లెజెండరీ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి పలు సినిమాల్లో ఆమె కనిపించారు.