News August 5, 2024
థాంక్స్ నాని.. నీ విష్ నిజం కావాలి: అల్లు అర్జున్
దసరా సినిమాకు నాని ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు, అల్లు అర్జున్‌కు మధ్య ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ నడిచింది. నాని తన ఫిలింఫేర్ గురించి చెబుతూ చేసిన ట్వీట్‌కి బన్నీ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. స్పందించిన నాని, వచ్చే ఏడాది మీ ‘రూల్’కి కూడా అనేక అవార్డులు దక్కాలంటూ అభిలషించారు. తాను కూడా అది నిజం కావాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ బదులిచ్చారు.
Similar News
News September 15, 2024
IPLలో కలిసి ఆడి టెస్టులో స్లెడ్జింగ్.. షాకయ్యా: ధ్రువ్ జురెల్
IPLలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కలిసి ఆడిన జో రూట్ టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్ చేయడంతో షాకయ్యానని ధ్రువ్ జురెల్ చెప్పారు. ఈ ఏడాది రాజ్‌కోట్ వేదికగా ENGతో జరిగిన టెస్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అతను గుర్తు చేసుకున్నారు. ‘రూట్ అదేపనిగా నన్ను స్లెడ్జింగ్ చేశారు. అతని మాటలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే మనం ఇప్పుడు దేశం కోసం ఆడుతున్నామని అతను చెప్పారు’ అని పేర్కొన్నారు.
News September 15, 2024
‘మత్తు వదలరా-2’ చూసి చాలా ఎంజాయ్ చేశాం: మహేశ్ బాబు
మత్తు వదలరా-2 మూవీ యూనిట్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ‘సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాం. సింహా, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వెన్నెల కిశోర్ స్క్రీన్‌పై కనిపించగానే నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్యను చూస్తున్నంతసేపూ మేమంతా నవ్వుతూనే ఉన్నాం. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు.
News September 15, 2024
Learning English: Synonyms
✒ Amazing: Incredible, Unbelievable
✒ Anger: Enrage, Infuriate, Arouse
✒ Angry: Wrathful, Furious, Enraged
✒ Answer: Reply, Respond, Retort
✒ Ask: Question, Inquire, Query
✒ Awful: Dreadful, Terrible, Abominable
✒ Bad: Depraved, Rotten, Sinful
✒ Beautiful: Gorgeous, Dazzling, Splendid
✒ Begin: Start, Open, Launch, Initiate