News May 14, 2024

కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్

image

AP: వైసీపీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలను లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నా’ అంటూ సీఎం జగన్ పోస్ట్ పెట్టారు.

Similar News

News January 10, 2025

హంసలోని ఈ గొప్ప గుణం గురించి తెలుసా?

image

హంస నీటి నుంచి పాలను వేరు చేసి వాటిని మాత్రమే సేవిస్తుందని చెబుతుంటారు. దీంతోపాటు మరో గొప్ప గుణమూ హంసకు ఉంది. ఇవి తమ భాగస్వామితో బలమైన, జీవితకాల బంధాలను ఏర్పరచుకోవడంలో ప్రసిద్ధి చెందాయి. హంస తన భాగస్వామిని కోల్పోతే, అది తీవ్ర దుఃఖాన్ని అనుభవించడంతో ఆరోగ్యం క్షీణించి మరణిస్తుందని ప్రతీతి. ప్రతి ఒక్కరూ ఇలా తమ భాగస్వామిని ప్రేమించాలని ఉదాహరణగా వ్యాఖ్యానిస్తుంటారు.

News January 10, 2025

రేపు చెక్కుల పంపిణీ: టీటీడీ ఛైర్మన్

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విచారకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిపైనా నెట్టడం లేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, వారి పిల్లలకు చదువులు చెప్పించడంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

News January 10, 2025

పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఔట్..? స్పందించిన పీసీబీ

image

<<15098726>>స్టేడియాలు సిద్ధంగా లేకపోవడంతో<<>> పాక్‌ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వేరే దేశానికి వెళ్లనుందని వచ్చిన వార్తలపై పీసీబీ స్పందించింది. సుమారు 12 బిలియన్(పాక్ రూపాయలు) వెచ్చించి స్టేడియాల్ని సిద్ధం చేశామని స్పష్టం చేసింది. స్టేడియాల సన్నద్ధతపై వచ్చిన వార్తల కారణంగా గందరగోళం ఉండకూడదనే ప్రకటన విడుదల చేశామని తెలిపింది. పనులు వేగంగా జరుగుతున్నాయని, టోర్నీ కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేసింది.