News March 31, 2025
‘జయం’లో ముందు హీరోయిన్‌గా ఆ యాంకర్.. చివరికి

నితిన్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘జయం’ సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోయిన్ సదా నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా నితిన్ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ముందుగా రష్మిని హీరోయిన్‌గా అనుకున్నారని తెలిపారు. ఆమెతో కలిసి రిహార్సల్స్ చేసినట్లు చెప్పారు. అయితే చివరి నిమిషంలో సదాను తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాగా యాంకర్‌గా రాణిస్తున్న రష్మి పలు సినిమాల్లో సైతం నటించారు.
Similar News
News April 2, 2025
ఆరెంజ్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
News April 2, 2025
SBI అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా?

నిన్న ఎస్బీఐ సేవల్లో <<15956785>>అంతరాయంతో<<>> కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉ.8.15 నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల్లో సమస్యలు ఎదురయ్యాయి. తమ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయ్యాయని, ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకా డబ్బులు క్రెడిట్ కాలేదని, వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై SBI ఇంకా స్పందించలేదు. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?
News April 2, 2025
శ్రేయస్ అయ్యర్ సరికొత్త ఘనత

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరో ఘనత సాధించారు. టోర్నీలో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన మూడో కెప్టెన్‌గా అయ్యర్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 72 మ్యాచులకు సారథ్యం వహించి 55.55% విజయాలు సాధించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (55.06%) రికార్డును ఆయన అధిగమించారు. ఈ జాబితాలో ధోనీ (58.84%) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సచిన్ (58.82%) కొనసాగుతున్నారు.