News August 6, 2024
ఆ కంపెనీ సీఎం రేవంత్ సోదరుడిదే: BRS శ్రేణుల విమర్శలు
తెలంగాణలో ‘స్వచ్ఛ్ బయో’ కంపెనీ <<13792751>>రూ.1000 కోట్లతో<<>> ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైన అనుముల జగదీశ్వర్ రెడ్డి పేరిట ఉందని, 15 రోజుల కిందటే రిజిస్టర్ అయినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాన్ని ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.
Similar News
News January 15, 2025
ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ
AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.
News January 15, 2025
త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. త్వరలోనే రాహుల్ పర్యటన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అటు ఇవాళ ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
News January 15, 2025
ఆస్కార్ అవార్డులు రద్దు? 96 ఏళ్లలో ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చును ఆర్పడం ఎవరివల్లా కావడం లేదు. ఇంతింతగా పెరుగుతున్న మంటల నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ కార్చిచ్చు ‘ఆస్కార్’ను తాకేలా కనిపిస్తోంది. దీనివల్ల ‘ఆస్కార్-2025’ ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ ప్రకటన కూడా వాయిదా పడింది. ఒకవేళ రద్దయితే 96 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది.