News September 27, 2024

ఆ డేటింగ్ యాప్‌లో హీరోలూ ఉన్నారు: ఊర్వశీ రౌతేలా

image

తనతోపాటు చాలా మంది సెలబ్రిటీలు ‘రాయ’ డేటింగ్ యాప్‌లో ఉన్నారని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తెలిపారు. మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్‌లో చేరినట్లు ఆమె చెప్పారు. హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్ కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్లు యాప్‌లో చేరారని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ కోసమే ఈ యాప్‌లో చేరానని, దీనిని మరో కోణంలో చూడొద్దని ఆమె అన్నారు. కాగా టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో ఊర్వశి డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి.

Similar News

News October 5, 2024

అబుదాబిలో ఎంజాయ్ చేస్తోన్న హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అబుదాబిలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దేహ్‌తో కలిసి ఆయన NBA టోర్నీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా ప్లేయర్లను మోటివేట్ చేసేందుకు ఆయన దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

News October 5, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 5, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
అసర్: సాయంత్రం 4:23 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:02 గంటలకు
ఇష: రాత్రి 7.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 5, 2024

‘RG కర్’ మృతురాలి ఫొటో వెల్లడించిన వారికి నోటీసులు

image

కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మృతురాలి వివరాలను, ఫొటోను సోషల్ మీడియాలో పలువురు వెల్లడించారు. అలాంటి 25మందిని కోల్‌కతా పోలీసులు గుర్తించి నోటీసులు పంపించినట్లు సమాచారం. వీటిలో కొన్ని బంగ్లాదేశ్ నుంచి కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఐపీ అడ్రెస్‌ ఆధారంగా వాటిని ట్రేస్ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.