News December 13, 2024
ఆ రోజు సెలవు.. టెన్త్ ఎగ్జామ్ వాయిదా!
AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే <<14851568>>ప్రకటించింది<<>>. అయితే అందులో స్వల్ప మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది MAR 31న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంది. క్యాలెండర్ ప్రకారం ఆరోజు రంజాన్ సెలవు ఉంది. నెలవంక కనిపించే విషయాన్ని బట్టి పండగ అదేరోజు వస్తే మరుసటి రోజు APR 1కి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
Similar News
News January 16, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.10వేల కోట్ల ప్యాకేజీ?
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఫైనాన్షియల్ ప్యాకేజీ కింద రూ.10వేల కోట్లు ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో చర్చించిందని జాతీయ మీడియా పేర్కొంది. ఆర్థిక ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
News January 16, 2025
మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?
జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.
News January 16, 2025
నా నిజాయితీని నిరూపించుకుంటా: KTR
TG: ACB, ED ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని కేటీఆర్ చెప్పారు. ఈడీ విచారణ తర్వాత మాట్లాడుతూ ‘ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెబుతా. విచారణకు సహకరిస్తా. రాజ్యాంగాన్ని, కోర్టులను గౌరవించే వ్యక్తిగా నా నిజాయితీని నిరూపించుకుంటా అని వారితో చెప్పా. అయితే విచారణకు ₹5-10 కోట్లు ఖర్చు పెట్టడం బాధగా ఉంది. ఈ మొత్తంతో 2,500 మందికి పెన్షన్లు, 500 మందికి రుణమాఫీ చేయొచ్చు’ అని చెప్పారు.