News August 27, 2024
ఆ ఇన్నింగ్స్ నాకెంతో ప్రత్యేకం: ధవన్

క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఓపెనర్ శిఖర్ ధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2015 వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికాతో మ్యాచులో ఆడిన ఇన్నింగ్స్ తనకు ఎంతో ప్రత్యేకమని ఓ పాడ్ కాస్ట్లో చెప్పారు. 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు చేతికి గాయమైనా అలాగే ఆటను కొనసాగించినట్లు చెప్పారు. ఈ మ్యాచులో ధవన్ 137 పరుగులు చేయగా భారత జట్టు 130 రన్స్ తేడాతో సఫారీలపై విజయం సాధించింది.
Similar News
News November 27, 2025
హీరోయిన్ కూడా మారారా!

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.
News November 27, 2025
స్వెటర్లు ధరిస్తున్నారా?

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: చంద్రబాబు

AP: పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకూడదని, 2 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.


