News August 27, 2024
ఆ ఇన్నింగ్స్ నాకెంతో ప్రత్యేకం: ధవన్
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఓపెనర్ శిఖర్ ధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచులో ఆడిన ఇన్నింగ్స్ తనకు ఎంతో ప్రత్యేకమని ఓ పాడ్ కాస్ట్‌లో చెప్పారు. 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు చేతికి గాయమైనా అలాగే ఆటను కొనసాగించినట్లు చెప్పారు. ఈ మ్యాచులో ధవన్ 137 పరుగులు చేయగా భారత జట్టు 130 రన్స్ తేడాతో సఫారీలపై విజయం సాధించింది.
Similar News
News September 7, 2024
BREAKING: మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం.. ఆరుగురి మృతి
మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో మైతేయి, కుకీ తెగల మధ్య మరోసారి వివాదం మొదలైంది. జిల్లాలోని నుంగ్‌సిప్పి, రషీద్‌పూర్ గ్రామాలలోని తేయాకు తోటల్లో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 7, 2024
ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 4, 4
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-B బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నారు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బౌండరీల వర్షం కురిపించారు. ఆ ఓవర్ తొలి బంతిని డిఫెండ్ చేసిన సర్ఫరాజ్ మిగిలిన 5 బంతుల్లో 5 బౌండరీలు బాదారు. దీంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్(32), పంత్(29) ఉన్నారు.
News September 7, 2024
ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై దుమారం
కశ్మీరీ వేర్పాటువాది అఫ్జల్ గురును ఉరి తీయడం వల్ల ఏదైనా ప్రయోజనం నెరవేరినట్టు తాను భావించడం లేదని JK మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఎప్పటికీ ఉగ్రవాదులతోనే ఉంటుందంటూ ఆరోపించింది. అఫ్జల్‌ను ఉరితీయడం వల్ల ఎలాంటి మంచి జరగలేదంటున్న ఇండియా కూటమి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తోందా అని నిలదీసింది.