News December 9, 2024
అంటే.. రాహుల్ నాయకత్వంపై విభేదాలు నిజమేనా!
INDIA కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యంపై చర్చ తీవ్రమవుతోంది. కూటమి నేతల మాటలూ, చేతలూ పరోక్షంగా ఇవే సంకేతాలను పంపిస్తున్నాయి. ‘వాళ్లకు చేతకాకుంటే నేనే నడిపిస్తా’ అని మమతా బెనర్జీ అన్నారు. మహారాష్ట్ర Sr పొలిటీషియన్ శరద్ పవార్ సైతం ఆమె సమర్థురాలని చెప్పి RGకి పరోక్షంగా పంచ్ ఇచ్చారు. మహారాష్ట్రలో MVA నుంచి విడిపోయిన SP.. TMCతో కలిసి అదానీ అంశంపై పార్లమెంటులో INDIA MPల నిరసనలో పాల్గొనలేదు. COMMENT
Similar News
News January 20, 2025
మొబైల్ రీఛార్జ్‌లపై GOOD NEWS
రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్‌గా ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. జియో, ఎయిర్టెల్, Vi యూజర్స్ 90 రోజులు, BSNLకు 180 రోజుల పాటు యాక్టివేట్‌గా ఉంటాయని తెలిపింది. అనంతరం సిమ్ Deactivate కాకుండా ఉండాలంటే నెట్‌వర్క్‌ను అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలంది. ఇది రూ.20తో స్టార్ట్ చేయాలని ట్రాయ్ సూచించింది. 2 సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
News January 20, 2025
ట్రంప్ వ్యక్తిగత సమాచారం
డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ఫ్రెడ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 1971లో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించారు. ట్రంప్ తొలుత ఇవానాను పెళ్లి చేసుకొని 1990లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత నటి మార్లాను పెళ్లాడారు. వీరికి ఒక కూతురు. 1999లో విడాకులు తీసుకుని 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.
News January 20, 2025
లోకేశ్ సీఎం అవుతారన్న మంత్రి.. సీఎం ఆగ్రహం
AP: దావోస్ పర్యటనలో మంత్రి <<15206909>>భరత్<<>> ప్రసంగంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని ఆయన్ను మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని భరత్‌కు చంద్రబాబు హితబోధ చేశారు. భవిష్యత్తులో లోకేశే సీఎం అంటూ జ్యూరిచ్‌లో మంత్రి భరత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.