News September 29, 2024
అది న్యాయానికి కొలమానం.. నస్రల్లా మృతిపై బైడెన్
హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చడాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమర్థించారు. ‘నాలుగు దశాబ్దాల తీవ్రవాద పాలనలో వందలాది మంది అమెరికన్ల మరణానికి నస్రల్లా, హెజ్బొల్లానే కారణం. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అతని మరణం ఇజ్రాయెలీలు, లెబనీస్ పౌరులతో సహా వేలాది మంది అతని బాధితులకు న్యాయం చేసే కొలమానం’ అని పేర్కొన్నారు.
Similar News
News October 4, 2024
తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’
ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000km ప్రయాణించి, రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేసింది. 22 రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత OCT 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. 1958 జనవరి 4న ఇది కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణంపై పడిపోయింది.
News October 4, 2024
15 శాతం వృద్ధి రేటు సాధించాలి: సీఎం చంద్రబాబు
AP: గత ప్రభుత్వ అస్పష్ట ఆర్థిక విధానాల కారణంగా చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగంలో సాధించాల్సిన వృద్ది రేటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన కష్టాలున్నా 2014-19లో 13.7% వృద్ధిరేటును సాధించామని, గడిచిన 5 ఏళ్లలో వృద్ధి రేటు 10.59%కి పడిపోయిందని చెప్పారు.
News October 4, 2024
‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఎన్టీఆర్
డైరెక్టర్ కొరటాల శివతో తన ప్రయాణం ‘బృందావనం’ సినిమాతో ప్రారంభమైందని, ఇప్పుడు ఆయన తన ఫ్యామిలీ మెంబర్‌గా మారారని ఎన్టీఆర్ తెలిపారు. ‘దేవర’ సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు. ‘ఈ జన్మలో నేను మీ కోసం ఎంత చేసినా అది వడ్డీ మాత్రమే. వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా’ అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.